జీవితమంటే జీవించడం జయించడం - కవిత

7 Nov 2015

మొక్కను నాటింది నేనే కదా..అని దాని చిదిమేసే హక్కు కూడా నాదే అనుకోవడం ఎంత మూర్ఖత్వమో..కన్నతల్లి ని కాబట్టి నా బిడ్డలను నేను చంపుకో వడం అనుకోవడం అంతే మూర్ఖత్వం..ప్రతి కుటుంబంలో అనేక సమశ్యలుంటాయి..కలతలుంటాయి..ఎన్ని సమశ్యలున్నా సర్దుకుంటూ ..అవసర మైతే ఒంటరిగా నైనా బ్రతుకుతూ తన బిడ్డలకు తన జీవితమే పాఠం నేర్పాలి..అందరూ గర్వపడేలా బ్రతకాలి..ముందుకు సాగిపోవాలి తప్ప ప్రాణాలను తీసుకుని..బిడ్డలను చంపుకుని సాధించేది ఏమీ లేదు..ఏ బంధాలు శాస్వతం కాదు..అలాంటప్పుడు..ప్రేమలో ఓడిపోయామనో..భర్త బాధలు పెడుతున్నాడనో చనిపోవడం పిరికితనమే అవుతుంది..బ్రతికి ఉండి కూడా అనేక జబ్బులు..(కాన్సర్, హార్టెటాక్ లాంటివి..) ఉన్నా జీవితంతో పోరాడుతూ బ్రతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు..నేటి యువతకు విచక్షణా జ్ఞానం ఉండటం లేదు.ఆవేెసపూరిత నిర్ణయాలే తప్ప.దీనికంతటికీ కారణం ఉమ్మడి కుటుంబాలు లేకపోవడం.ర్యాంకులు కోసం పరుగులే తప్ప , జీవిత పాఠలు నేర్పే వారే లేరు.తల్లిదండ్రులు చిన్నప్పటి నుండి పిల్లలను నైతిక విలువలతో, ధైర్యసాహసాలను నూరిపోస్తే ఇలాంటి పరిస్థితులు తగ్గుముఖం పడతాయి..
జీవితమంటే జీవించడం
జయించడం
నలుగురికి ప్రేమను పంచడం
సమతను పెంచడం
నలుగురితో బ్రతకడం
సఖ్యతతో మెలగడం
సహనంతో మసలడం
మనతో మరో నలుగురిని బ్రతికించడం...
మరో నలుగురికీ ఆదర్శమయ్యేలా ఎదగడం..
ఎదిగిన కొలదీ ఒదగడం...
                  - వైష్ణవి శ్రీ