పేదోడికి తుండు కూడా మిగలకూడదు....!! ఇది మన ప్రజా ప్రభుత్వ వైకరి.

7 Nov 2015పన్నులు విదిస్తున్నపుడు సంపన్నులకు ఒకలా బీదా మద్య తరగతికి ఒకలా చూసి విదిస్తే బాగుంటుంది...!!
ఉదాహరణకు :
విమానం చార్జీలు తగ్గింపు - సామాన్యుడికి విమాన దరలు అందుబాటులో...!!
నిజానికి 2000/- ఖర్చు చేసి సామాన్యుడు విమానం ఎక్కి హైదరాబాద్‌ వెళ్ళడు.
ఆర్టీసి టికెట్‌ దరలు పెంపు - అంటే సామాన్యుడ్ని విమానం ఎక్కించేందుకా...!!
భారం మేయలేని వాడిపైన ఇంకా భారం మోపుతూ...!! భారం మోయగలిగే వాడికి ఈ మోయలేని వాడికి చేరువ చేస్తున్నాం అనే నెపంతో మరింత తెలిక చేస్తున్నారు.
ఇప్పుడు 0.5 స్వశ్చ భారత్‌ పన్ను కూడా అన్ని వినియోగ సేవలపైన విదిస్తూ అందులో అత్యదికంగా సామాన్యుడ్ని కాల్చేస్తూ సంపన్నుడికి సెగ తగిలిస్తున్నారు.
నిజంగా స్వశ్చభారత్‌ పన్ను విదించాలి అంటే సంపన్నుల మీదే 0.5 కాకుండా 50/- వేయోచ్చుగా .కానీ వేయరు...!!
ఎందుకంటే ఆ పన్నులు విదించే వాళ్ళు, వాల్ల పిల్లలు వారి వారి బినామీలు అందరు సంపన్నులేగా...!! వీల్ల జేబులకు చిల్లు పడకూడదు...!!
పేదోడికి తుండు కూడా మిగలకూడదు....!! ఇది మన ప్రజా ప్రభుత్వ వైకరి.
                                                                                                               :  సంజయ్ లంక