మెంతులు – ప్రయోజనాలు

8 Nov 2015


మెంతులు – ప్రయోజనాలు
మెంతి కూర, మెంతులు : దాదాపు ఇవి లేకుండా వంటకాలు తయారుకావు.. ఏదైనా వంటకానికి మంచి రుచి రావాలంటే ఏ రూపలోనైనా, కొద్దిగా మెంతులు కలపవలసిందే! మెంతి కూర పప్పు, మెంతి పరోటా, మెంతి కూర పచ్చడి, మెంతి ఆవాకాయ…..ఒకటేమిటి! ఇలా ఎన్నో రకాల వంటకాలు. ఇంచుమించు అన్ని రకాల వంటకాల్లో మెంతులను వాడుతూ ఉంటాం. ఎందుకంటే మెంతులకు ఔషధ లక్షణాలు ఉన్నాయి. ఔషధ లక్షణాలు కలిగిన మెంతులను వాడటం వలన మనకు ఏ ఏ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుని మరీ వాడుకుందాం!
అధ్యయనాల ప్రకారం, మెంతులలో ముఖ్యంగా, కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించటానికి సహాయపడే తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ (LDL) ఉన్నదని తెలుస్తున్నది. మెంతులు, కొలెస్ట్రాల్ మరియు ట్రైగ్లిజెరైడ్స్ శోషణ నిరోధించే స్టెరాయిడ్ సపోనిన్లు యొక్క గొప్ప మూలం. వీటిలో అధిక మొత్తంలో పొటాషియం ఉన్నది. ఈ పొటాషియం రక్తపోటు, గుండె రేటును నియంత్రించే సోడియంను సరిగా పనిచేసేట్లుగ చూస్తుంది.
మధుమేహంతో బాధపడేవారు తప్పనిసరిగా మెంతులను తమ ఆహారంలో చేర్చుకోవాలి. మెంతుల్లో ఉండే సహజంగా కరిగే ఫైబర్, ‘గలాక్తోమన్నన్’ ఉండటం వలన రక్తంలో చక్కెర శోషించే రేటును తగ్గిస్తుంది. వీటిలో ఆమినో ఆమ్లం ఉండటం వలన మధుమేహాన్ని నియంత్రించే ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది. అందువలన మెంతులు మధుమేహ వ్యాధిగ్రస్తుల పాలిట వరం. వీటిని ఏ రూపంలోనైనా ఆహారంలో తీసుకోవటం మంచిది.
మెంతులలో ఫైబర్, అనామ్లజనకాలు అధికమొత్తంలో ఉన్నాయి. వీటిని తీసుకోవటంవలన విషపదార్థాలను బయటకు నెట్టివేసి, జీర్ణక్రియను సజావుగా సాగేట్లు చేస్తుంది. మెంతులతో తయారుచేసిన టీ, అజీర్ణం, కడుపునొప్పికి ఉపశమనం కలిగిస్తుంది. మెంతుల కషాయం ఉదయంపూట తీసుకోవటం వలన మలబద్ధకం నివారింపబడుతుంది. కొద్దిగా మెంతులను పెరుగులో కలిపి తీసుకుంటే అతిసారం తగ్గుతుంది.
కొద్దిగా మెంతులను నీటిలో నానపెట్టి, తీసుకుంటే గ్యాసుతో కూడిన గుండెమంట నివారింపబడుతుంది. వీటి పైన ఉన్న జిగురుకోటు కడుపు మరియు ప్రేగులలో ఒక పూతలాగా ఏర్పడి, మనకు చిరాకు కలిగించే జీర్ణశయాంతర కణజాలం నుండి ఉపశమనం కలుగచేస్తుంది. అధికబరువు ఉన్నవారు నానబెట్టిన మెంతులను ఉదయాన్నే పరకడుపున తీసుకున్నందువలన, బరువును కోల్పోతారు. ఒక టీ స్పూన్ నిమ్మరసం మరియు తేనెతో మెంతులను కలిపి తీసుకుంటే జ్వరం, దగ్గు, గొంతునొప్పి ఉపశమిస్తాయి.
మెంతులలో ఉన్న ‘డైయోస్ జెనిన్’ పదార్ధం, శిశువులకు పాలిచ్చే తల్లులలో తల్లిపాల ఉత్పత్తిని పెంచుతుంది.. అందువలన బాలింతరాళ్ళు మెంతులను ఆహారంలో తీసుకోవటం మంచిది. మెంతులు గర్భిణులు ఆహారంలో పరిమితంగా, క్రమంతప్పకుండా తీసుకున్నందువలన ప్రసవ సమయంలో గర్భాశయ సంకోచాలను ఉత్తేజపరిచి, నొప్పులను కూడా తగ్గిస్తుంది. అయితే, మెంతులను గర్భిణులు అతిగా తీసుకున్నందువలన గర్భస్రావం లేదా అపరిపక్వ జననం జరగవచ్చు. మెంతులు ఋతుక్రమంలో కలిగే కడుపునొప్పిని కూడా నివారిస్తాయి.
మెంతి ఆకులలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. మెంతికూరను టమాటోలతోగాని, బంగాళాదుంపలతోగాని తీసుకున్నందువలన మన శరీరానికి ఐరన్ ఎక్కువగా అందుతుంది. వీటిలో ఈస్ట్రోజెన్ వంటి లక్షణాలు ఉన్నందువలన, మెంతులు ఆడవారి వక్షోజాల పరిమాణంలో కొద్దిపెరుగుదలకు తోడ్పడతాయి. మెంతులు క్యాన్సర్ వంటి వ్యాధిని నివారించటంలో కూడా సహాయపడతాయి.
మెంతులలో విటమిన్ ‘సి’ ఉన్నది, కనుక వీటిని నానబెట్టి, పేస్ట్ లాగా చేసి, దానిని కాలిన గాయాల మీద ,ఎక్జిమా వంటి చర్మవ్యాధులకు పూయండి. ఇది ఒక ఔషధంలాగా పనిచేస్తుంది. మెంతుల పేస్ట్ చర్మం మీద ముడుతలను తొలగించే యాంటి-ఏజింగ్ క్రీమ్ లాగా పని చేస్తుంది. ముఖం మీద బ్లాక్ హెడ్స్ కూడా తొలగిస్తుంది.
మెంతి ఆకులనుగాని, మెంతులనుగాని ఫేస్ ప్యాక్ లాగా వాడవచ్చు. ఈ ప్యాక్ ను 20 నిముషాలపాటు ముఖంపైన వేసి, తరువాత కడగండి. మెంతిగింజలను ఉడికించిన నీటితో ముఖాన్ని కడిగి చూడండి. ఫలితం చూసి ఆశ్చర్యపోతారు. మెంతిగింజల పేస్ట్ జుట్టుకు పట్టించండి. మీ జుట్టు మెరుస్తూ, నల్లగా నిగనిగలాడుతూ ఉంటుంది. మెంతులను వేడినీటిలో ఒక రాత్రంతా నానపెట్టండి. మరుసటిరోజు ఆ నీటిని కొబ్బరినూనెతో కలిపి తల మీద మర్దన చేయండి. ఇలా క్రమం తప్పకుండా చేయటం వలన జుట్టు రాలటం, చుండ్రు నివారింపబడుతుంది. మెంతుల పేస్ట్ ను కొద్ది పాలతో కలిపి ముఖానికి పట్టించండి. 15 నిముషాల తరువాత కడగండి. మీ ముఖం కాంతివంతంగా తయారవుతుంది. ఇలా చెప్పుకుంటూ పొతే ……….ఎన్నో, ఎన్నెన్నో, మెంతుల వలన ప్రయోజనాలు. ప్రయత్నించండి. -healthtipsintelugu