ఎర్ర బంగారం కోసం పాకులాడుతున్న పచ్చ పెద్ద దొర

13 Nov 2015
ఎర్ర బంగారం కోసం పచ్చ జెండా ఊపి పాకులాడుతున్న పచ్చ పెద్ద దొర....

2000 లోనే బాక్సైట్ మైనింగ్ చెయ్యాలని అన్నిఅడ్డదారులు తొక్కి గవర్నర్ ఆదేశం మేరకు వెనక్కి తగ్గి,,, తిరిగి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నీతి మాటలు మాట్లాడి కేంద్రానికి లేఖ రాసే.
మరి ఆ తెలివి ఇప్పుడేమాయనో ??
మళ్లి మైనింగ్ షురూ. నాటకీయంగా, తాను రాసిన లేఖను తేదేపా వెబ్ సైట్ నుండి తొలగించిబడింది ఈ మధ్యలో.

ఇదేనా విలువలతో కూడిన రాజకీయం ??

‪#‎ShameOnYouBabu‬

బాక్సైట్ మైనింగ్ కి అనుమతిస్తూ ఇష్యూ చేసిన జి.ఓ. 97 ప్రకారం, చింతలపల్లి, జేరెల్ల రిజర్వు ఫారెస్ట్ క్రిందున్న 1212 హెక్టారుల అటవీ కొండ ప్రాంతాలు మటుమాయం కానున్నాయి. మరికొన్ని హెక్టార్లు క్రమంగా పెంచుతారు అనేదాంట్లో ఏ సందేహంలేదు.

☞బాక్సైట్ మైనింగ్ ఒక షాలో మైనింగ్ (బొగ్గు మైనింగ్ కోసం భూమిలోపలికి వెళ్లి వెలికి తీయాల్సిన పని లేదు).
☞ ముందుగా ఆ ప్రాంతంలోని చెట్లను తొలగించడం,,, గిరిజనులకు వేరే చోట ఆశ్రయం కల్పించడం,, జంతుజాతిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం.
☞ మైనింగ్ తరువాత తిరిగి యధావిధిగా అటవీ ప్రాంతాన్ని rehabilitate చెయ్యడానికి అనువుగా నాణ్యమైన నేల పొరలను కొంత మేర తొలగించి ఒక చోట నిల్వ ఉంచడం.
☞ తరువాత క్రింది ఎర్రటి cap-rock ను బ్లాస్ట్ చేసి/proclainer తో తోలిగంచి మైనింగ్ ప్రాసెసింగ్ ప్లాంట్ కి తరలించడం.
☞ షాలో మైనింగ్ కాబట్టి సమాంతరంగా ఎన్ని వీలవుతే అన్ని excavators (proclainer, scrappers) లాంటి వాటితో బాక్సైట్ నిక్షేపాలున్న ఎర్రటి మట్టిని ట్రక్కులలో తోడి ప్రాసెసింగ్ ప్లాంట్ కి తరలించడం.

**********************************************************************************
☞ ఏ ఇబ్బంది లేకుండా 24 గంటలు ఈ మైనింగ్ జరిపించి, ఓర్ ని తరలించడం పెద్ద కష్టమేమి కాదు.
☞ ఎర్రటి బాక్సైట్ మట్టిని ట్రక్కులు తీసేకేల్లె దారంతా పొల్యూషన్ తో నిండిపోతుంది, ఎర్రటి ''మార్స్ గ్రహాన్ని'' తలపిస్తుంది.
☞ సకల రోగాలు అంటుకుంటాయి...మానవ ఉనికికే ప్రమాదం.
☞ మలేషియా లోని '' Kuantan '' ప్రాంతంలో మైనింగ్ వళ్ల జరిగిన నష్టాన్నీ ఇమేజస్ లో చూడొచ్చు.

**********************************************************************************

☞ అంతే కాక, ఆ మైనింగ్ కాంట్రాక్టు పొందిన కంపెనీలు అల్లుమినియం (బాక్సైట్ నుండి వెలికి తీసేది) ప్రాసెసింగ్ ప్లాంట్ కోసం ప్రతి రోజు 38 బిలియన్ లీటర్ల నీరు అందించే విధంగా ఒప్పందం కుదుర్చుకుంది. అది కూడా పోలవరం నుండి.
అసలు ముందుగా వైజాగ్ సిటి లో అందరికి సరిపడా త్రాగునీరు అందే పరిస్థితి ఉందా ? ముందు ఈ సమస్యని పరిస్కరించాటానికి తగు ఏర్పాట్లు చేసే అలోచేనే లేనేట్టుంది ఈ సర్కారుకు.

ఆ ప్లాంట్స్ ద్వారా వెలువడే కలుషిత నీటి వల్ల ఉన్న జలవనరులన్నీ కలుషితమవుతాయి. చుట్టు పక్కల ఉండే నదులు, భూగర్భజలాలన్నీ కలుశితమవుతాయని స్వయానా ‪#‎ఆయనే‬మొత్తుకున్నారు అప్పట్లో (కావాలంటే, ఒక ఇమేజ్లో ఆయన మాటలు చూడండి).
☞ ఇదే కాక ఆ ప్లాంట్కి ఎంతమేర విద్యుత్ సరఫరా కావాలో అది కూడా ప్రభుత్వమే సమకూరుస్తుంది.

**********************************************************************************

☞ సెక్షన్ ల వారిగా మైనింగ్ ప్రాంతాన్ని విభజించి మైనింగ్ చేపడతారు.. ఒక సెక్షన్లో మైనింగ్ పూర్తవుతే, వెంటనే అక్కడ rehabilitation చెర్యలు చేపట్టాలి.
☞ rehabilitation అంటే ఎదావిధిగా తీసివుంచిన సారవంతమైన మట్టిని తిరిగి అ సెక్షన్ లో కప్పేసి, చెట్లను తిరిగి నాటడమో, లేక ముందే పెరిగిన చెట్లను తీసుకొచ్చి ఇక్కడ నాటడమో చేసి అవి నిలదోక్కునేలా తగు జాగర్తలు తీసుకోవాలి. మరి ఈ కార్పొరేట్ సంస్థలు ఆ పనిని సరిగ్గా చేయునా ?

**********************************************************************************

☞ ఈ మైనింగ్ ద్వారా ప్రభుత్వ ఆదాయం బాగానే పెరుగుతుంది. కాని మన eastern ghats ని నాశనం చేసి డబ్బు సంపాదించాల్సిన అవసరం ఉందా ??
☞ ఇలా అభివృద్ధి పేరుతో సహజ వనరులను నాశనం చేసుకుంటా పోవాల్సిన గతి పట్టిందా మన రాష్ట్రానికి ?
☞ నల్లమల్ల అడవులలో వజ్రపు గనులున్నాయని కనుగొన్నారు. రేపొద్దున్న ఈ అడవులను నరికేసే అలోచెనలు ఉన్నాయా ??

*********************************************************************************


☞ ఇంతకాలం లేనిది ఇప్పుడెందుకు ఈ మైనింగ్ మీద కన్ను పడింది ?? ఇక్కడ సహజ వనరులను నాశనం చేసి అమరావతి కోసం వాడటానికా ??
☞ '' హెరిటేజ్'' సైట్లను, అడవులను, పంటభూములను నాశనం చెయ్యడమే మీ ముఖ్యఉద్దేశమా ??
☞ అమరావతి పేరుతో రైతుల జీవనోపాధిని కొల్లగొట్టి వారిని వెళ్లగొట్టేలా చేస్తున్నారు, ఇప్పుడు ఈ గిరిజనుల వంతు వచ్చిందా??
☞ అసలు ఆ ప్లాంట్ కు సరిపడా నీరు అందిచడానికి పోలవరం ఎప్పటికి పూర్తవుతుందో ?? లేక, పట్టిసేమ లాంటి డబ్బుల్లు దండుకునే మరో స్కీం వేస్తాడో ఏమో ??
☞ రానున్నరోజుల్లో ఆ ప్రాంతం మరో Kuantan కానుందా ??

ఏమో ?? ‪#‎ఆయనకు‬ పంటభూములన్నా, ప్రకృతి అన్నా అసలు పడదు !!
అప్పట్లో వరల్డ్ బ్యాంక్ పేరు జెప్పి రాష్ట్రాన్ని (ముఖ్యంగా రాయలసీమను) నాశనం చేసినాడు, ఇప్పుడు చైనా, సింగపూర్ అంటూ అడవుల, పంటపొలాల మీద పడినాడు.
ఇంకొక మూడేళ్ళు ఉన్నాయి..ఎన్ని అడవులు, పంట పొలాలు నాశనం అవ్వాలో ??

‪#‎SaveChinthalaPalliAndJerellaReserveForest‬
‪#‎SaveEasternGhats‬

‪#‎SayNoToBauxiteMining‬

*** Environmental problems related to bauxite mining
http://www.bauxietinstituut.com/files/Environmental%20problems%20related%20to%20bauxite%20mining%20and%20processing-Paul%20Ouboter.pdf
                                                   - v.k reddy rayalaseema