అనుష్క మరో విజయశాంతి?

14 Nov 2015


అనుష్కలో స్టార్ హీరోలకి మించిన ప్రాఫిటబుల్ హీరోని చూస్తున్నారు మన నిర్మాతలు. ఇప్పుడు ఏ పెద్ద స్టార్ హీరోకి అయినా కానీ సినిమాకి పది కోట్లపైనే పారితోషికం ఇచ్చుకోవాలి. ఇక స్టార్ హీరో అంటే స్టార్ డైరెక్టర్‌ని కూడా తెచ్చుకోవాలి. అతనికో పది కోట్లు ముట్టజెప్పుకోవాలి. ఇలా సినిమాకి పెట్టే పెట్టుబడిలో సగానికి పైగా వాళ్లిద్దరే పట్టుకుపోగా హిట్టు కొడతామనే గ్యారెంటీ కూడా వుండదు. అంటే పెద్ద రిస్కు మీద కనీసం సక్సెస్ గ్యారెంటీ కూడా వుండదన్నమాట. కాకపోతే బయ్యర్లు బుక్ అయిపోతారులే అన్నట్టు ప్రొడ్యూసర్లు కాంబినేషన్లు సెట్ చేసి వదిలేస్తుంటారు. అదే అనుష్కని హీరోగా పెట్టి సినిమా తీస్తే ఆమెకి పారితోషికం రెండు కోట్లిస్తే చాలు. అలాగే దర్శకుడితో పని లేదు.

మంచి కథ వుంటే ఎవరితో తీసినా కానీ సినిమా చెల్లుబాటు అయిపోతుంది. అనుష్కతో పది కోట్ల లోపు వ్యయంతో ఒక మంచి సినిమా తీసినట్టయితే కనీసం ముప్పయ్ కోట్ల వరకు షేర్ తెచ్చి పెట్టగల సత్తా తనకుంది. అనుష్కలాంటి బంగారు గనిని పెట్టుకుని హీరోల వెంట పడడం దేనికని ఇప్పుడు నిర్మాతలు తనతో సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. దిల్ రాజు లాంటి నిర్మాతలు కూడా అనుష్కతో చేయడమెంత ప్రాఫిటబుల్ అనేది తెలుసుకున్నారు. అందుకే ఆమె డేట్స్ బుక్ చేసి పెట్టుకున్నారు. కెరియర్ ఎండ్ దశకి వచ్చిందనుకున్న స్టేజ్‌లో అనుష్క మరో మూడేళ్ల పాటు గుడ్ బై చెప్పాల్సిన అవసరమే లేదంటున్నారు.