చిత్తూరు మేయర్ దారుణ హత్య

17 Nov 2015చిత్తూరు మేయర్ కఠారి అనురాధను గుర్తుతెలియని దుండగులు హత్య చేశారు. మంగళవారం మధ్యాహ్నం బురఖా ధరించి వచ్చిన ఆరుగురు దుండగులు చిత్తూరు కార్పొరేషన్ ఆవరణలో అనూరాధపై నాలుగు రౌండ్ల కాల్పులు జరిపారు. పాయింట్ బ్లాంక్ రేంజిలో నేరుగా నుదుటిపై కాల్పులు జరపడంతో.. ఆమె సంఘటన స్థలంలోనే మృతిచెందారు. అనూరాధతో పాటు ఉన్న ఆమె భర్త కఠారి మోహన్‌పై దుండగులు కత్తులతో దాడి చేశారు. ఆయన తీవ్రంగా గాయపడ్డారు. కార్పొరేషన్‌ కార్యాలయంలో వినతులు స్వీకరిస్తుండగా దుండగులు, మేయర్‌ని హత్య చేయడంతో కార్యాలయంలోని సిబ్బంది, సాధారణ ప్రజానీకం భయభ్రాంతులకు గురయ్యారు. అందరూ తేరుకునేలోపే దుండగులు పరారయ్యారు. పోలీసులు దుండగుల్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సొంత జిల్లాలో, అదీ జిల్లా కేంద్రం చిత్తూరులో.. అందునా మేయర్‌ కార్యాలయంలో మేయర్‌ హత్య జరగడం తీవ్ర కలకలం రేపుతోంది.