ప్రేమ పేరుతో వేదించకండి..మనసుతో ఆడుకోకండి

8 Nov 2015

వివాహితవైనా పరవాలేదు నిన్ను ప్రేమిస్తున్నానంటూ..వెంటపడతారు( ఆడలేదామగ) ఇంకా అవసరమైతే శారీరక వాంఛ కూడా తీర్చుకుంటానంటారు..కాని అది నిజమైన ప్రేమంటారా..రోడ్డు మీద వెళుతుంటే ఎంతో మంది అందమైన వాళ్ళు కనబడుతుంటారు అందరిని ప్రేమించలేం కదా..ప్రేమ అంటే అసలేమిటి.. కేవలం శారీరక వాంెఛ మాత్రమేనా..కానే కాదు..
నేనున్నాననే భరోసా..చిన్న బాధ కలిగినా ఊరడింపు కావాలి ...కన్నవారిని సైతం మరపించాలి.ఇవేమి లేకుండా ప్రేమిస్తున్నానంటూ ..ఏవేవో పేలి..దగ్గరైన తరువాత..కనీసం తింటున్నారో లేదో.పట్టదు...బాధలను పట్టించుకోరు.కనీసం ఆరోగ్యం బాగోక పోతే మన సొంత వాళ్ళకిచ్చే శ్రద్ధలో ఒక్క వంతు కూడా..చూపించరు..అలాంటప్పుడు..ఈ లవ్వులు కొవ్వులు అవసరం లేదనుకుంటా
అసలు అయినా ఇంట్లో సొంతవాళ్ళుండగా..పరాయి సొత్తు కోసం ఆశపడటం..నీచాతినీచం ....రేపు హటాత్తుగా చనిపోయినా చివరి చూపు కూడా కరువే..
అందుకే దయచేసి ప్రేమ పేరుతో వేదించకండి..మనసుతో ఆడుకోకండి.. .....         వైష్ణవి శ్రీ