ఇప్పటికి ఆంధ్ర కు వచ్చిన ఐ.టి కంపెనీలు ఎన్ని ?

7 Nov 2015రాష్ట్రం విడిపోయి 2 సం. లు కావస్తుంది. ఇప్పటిదాకా ఎన్ని ఐ.టి. కంపెనీలు ఆంధ్రాకి తీసుకొచ్చారు? నాకు తెలిసి ఒక్కటి కూడా తీసుకురాలేదు.
కానీ నాకు తెలిసి, తెలంగాణా ప్రబుత్వం,
5000 కోట్లతో మైక్రోసాఫ్ట్ క్లౌడ్ ప్రాజెక్ట్ ను దక్కించుకుంది.
ఇప్పటి దాకా నాన్ ఐ.టి. కే పరిమితమైన గూగొల్ నుంచి, ఐ.టి. ప్రాజెక్ట్ లను విస్తరింపచేసేందుకు 10,000 కోట్లతో ఒప్పందం కుదుర్చుకుంది. అందుకు సంబంధించిన పనులు కూడా ప్రారంభమయ్యాయి.
ఇక ప్రపంచమంతా ఐ.టి. క్రైసిస్ వచ్చిన రోజుల్లో కూడా అప్పటి సి.ఎం. వై.ఎస్,
ఐ.టి. ని రాష్ట్ర నలుమూలలా విస్తరింపజేశారు.
ఉప్పల్లో ఐ.టి కారిడార్ ను అభివ్రుద్ది చేయడం,
ఆదిభట్లలో ఐ.టి కారిడార్ ను ఏర్పాటు చేయడం
ఫీనిక్స్ సెజ్ లో హెచ్.సి.ఎల్ కానీ, వాల్యూ లాబ్స్, ఇతర కంపెనీలు కానీ,
గచ్చిబౌలిలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కానీ, నానక్ రాం గూడలో వేవ్ రాక్ ఐ.టి హబ్ కానీ,
వైజాగ్ లో విప్రో, సత్యం కానీ, విజయవాడలో మేధా ఐ.టి టవర్స్ కానీ ,
ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఇవన్నీ కొత్తగా అభివ్రుద్ది చేయబడినవే!!
కేవలం ఐ.టి బూం ఉన్న రోజుల్లోనే చంద్రబాబు ఐ.టి ని అభివ్రుద్ది చేశాడు. వై.ఎస్. ఐ.టి క్రైసిస్ లో ఉన్న రోజుల్లో కూడా ఐ.టి ని కొత్త ప్రాంతాల్లో విస్తరింపజేశారు.
మన పొలం చుట్టూ ఉన్నవాళ్ళు ఒకే పంట వేసినప్పుడు మనం కూడా అదే వెయ్యాలి. లేదంటే వాటి ద్వారా వచ్చే ఈకువ వల్ల మనం వేరే పంట వేసినా ఎదగదు. కాబట్టి అదే పంట వేయడం మన గొప్పదనం కాదు. అది డిమాండ్ అని, అలాగే చుట్టూ పంటలు దెబ్బతింటున్న సమయంలో వెనుదిరగక ఎదురొడ్డి పంటను నిలబెట్టుకోవడం, పంట దిగుబడిని పెంచుకోవడం గొప్ప అని మా నాన్న ఎప్పుడూ చెప్తూ ఉండేవాడు.
ఆమాటల్లో ఎంతటి గొప్ప అర్దం దాగుందో ఇప్పుడు తెలుస్తుంది!!

:: సింగారెడ్డి  యల్లా