పెళ్లి పెటాకులు..ప్రేమించడానికి రెడీ!

9 Nov 2015


సంచలనాలకు కేంద్రబిందువుగా మారిన నాయికల్లో త్రిష ఒకరు. వరుణ్ మణియన్‌తో నిశ్చితార్థం అయిన కొంతకాలానికే పెళ్లి పెటాకులు అయ్యి వార్తల్లోకి ఎక్కింది ఈ చెన్నై చిన్నది. అయితే తాజాగా మరో స్టేట్‌మెంట్ ఇచ్చిందీ ముద్దుగుమ్మ. పెళ్లి ఆగిపోయినంత మాత్రాన మరొకరిని ప్రేమించకూడదని రూల్ ఏమైనా ఉందా? మళ్లీ ప్రేమలో పడడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటోంది. త్రిష మాట్లాడుతూ వరుణ్‌తో పెళ్లి ఆగిపోవడానికి కారణాలు ఏంటనేవి నాకు, నా కుటుంబ సభ్యులకే తెలుసు. దాని వెనుక ఎంతోమంది ఉన్నారు. అవన్నీ మరిచిపోయి నేనిప్పుడు ప్రశాంతంగా సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉన్నాను. ఏ ఆడపిల్లకైనా సమయం వచ్చినప్పుడు పెళ్లి జరగక తప్పదు. కానీ అది మన చేతుల్లో లేదు. సమయం వచ్చినప్పుడు ఏదీ ఆగదు. ఇప్పుడు కూడా నేను ప్రేమలో పడడానికి సిద్ధంగా ఉన్నాను. నాకు తగిన వరుడు దొరక్కపోడు కదా అని తెలిపింది. ప్రస్తుతం కమల్‌హాసన్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చీకటిరాజ్యం చిత్రంలో పోలీస్ పాత్రలో తొలిసారి గన్ను పట్టుకోనుంది. ఆ పాత్ర తన అభిమానులకు కొత్త అనుభూతి కలిగిస్తుందని త్రిష చెబుతోంది. అలాగే నాయకి, ఆరణ్మనై 2 సినిమాల్లో కూడా నటిస్తోంది.