నా కులం..నా వర్ణం..నా అన్న పదంలోనే ..ఉంది నాశనమంతా

7 Nov 2015

దేశాన్ని కాపాడే సైనికులకు లేవు కులమతభేదాలు

ఎగిరే త్రివర్ణపతాకానికి అంటుకోవు కులమతాల రంగులు

ముప్పూటలా తిని కూర్చునే రాజకీయాలకే అంటించుకుంటున్నారు కులమతాలను..

నా కులం..నా వర్ణం ..నా మతం ...

నా అన్న పదంలోనే ..ఉంది నాశనమంతా..

నా ఎప్పటికీ ఒంటరిదే..జనమంతా మనమంతా..భిన్నత్వంలో ఏకత్వాన్ని సూచిస్తుంది..కులీకుతుబ్షాహ్ చార్మినార్ ను కట్టించడంలో ఒక గూడార్ధం దాగిఉంది

నాలుగు ప్రాకారాలు నాలుగు మతాలను ( హిందూ, ముస్లిమ్, సిఖ్, క్రైస్తవులు) సూచిస్తాయి...అందరూ కలసిమెలసి ఉండాలని దానర్ధం ..మానవత్వానికి చిహ్నం చార్మినార్ ..

అంతే కాని నా హైదరాబాద్, నా విజయవాడ నా కులం నా మతం అని కొట్టుకు చావమని కాదు...

                  - వైష్ణవి శ్రీ