కళ్యాణ లక్ష్మీ

21 Nov 2015


@ కళ్యాణ లక్ష్మీ - చెత్త పథకం @
మీ ఆదిపత్యవర్గ బిడ్డలు
పెద్దపెద్ద సదువులు సద్వీ
సల్లగ ఏసీల కింద కొలువులు చెయ్యాలే
మా బిడ్డలు మీ బిడ్డలకు పోటీ రాకుండా
మీరిచ్చే యాబై వేలకు కక్కుర్తిపడి
పెళ్లీడు రాగానే త్వరగా పెళ్లి చెయ్యాలే
బాగుంది సారు మీ తెల్వీ..!
కళ్యాణ లక్ష్మీ కాకరకాయ లక్ష్మి మాకేమొద్దు
మా పిల్లల బాగు మీరు నిజంగానే కోరితే
ఉచితంగా సదివించి
ఇంటర్ సదివితె యాబై వేలు
డిగ్రి సదివితె లక్ష రూపాలు
పీజీ సదివితె గ్యారంటీ ఉద్యోగం ప్రకటించురి
ఆ పథకానికి మీరు సరస్వతి పెట్టుకుంటరో
మరేదైన పేరు పెట్టుకుంటరో మీ ఇష్టం.!

: Mamidi Amarendar