ఉగ్రవాదుల చేర నుండి తెలుగు ప్రొఫెసర్లు విడుదల

5 Aug 2015

వారం రోజులు క్రితం లిబియా రాజధాని ట్రిపోలి ప్రాంతంలో కిడ్నాప్ ఐన ఇద్దరు భారతీయ తెలుగు ప్రొఫెసర్లు నేడు క్షేమంగా విడుదల అయ్యారు. కిడ్నాపైన బలరాం, గోపీకృష్ణలను తీవ్రవాదులు డిమాండ్ల మేరకు అక్కడి భారత దౌత్య కార్యాలయానికి తరలించారని ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్ తెలియచేసారు. 

తెలుగు ఫ్రొఫెసర్లు విడుదల సమాచారం తెలియచేసిన విదేశాంగశాఖకు ఇరు కుటుంబాలు కృతజ్ఞతలు తెలిపారు. అతి త్వరలోనే బలరాం, గోపీకృష్ణలను భారత్ కు రప్పిస్తామని కంభంపాటి రామ్మోహన్ తెలిపారు.