మధ్య ప్రదేశ్ లొ గవర్నర్

28 Mar 2015

భోపాల్: మధ్య ప్రదేశ్ గవర్నర్ రామ్ నరేశ్ యాదవ్ తన కుమారుడు శైలేష్ యాదవ్ అంత్యక్రియలు నిర్వహించేందుకు ప్రత్యేక ఎయిర్ అంబులెన్స్ లో హాజరుకానున్నారు. అయితే తీవ్ర అనారోగ్యంతో భోపాల్ లోని సంజయ్ గాంధీ మెడికల్ ఇన్సిస్టిట్యూట్ లో చికిత్స పొందుతున్న ఆయనకు, యాభై ఏళ్ళ కొడుకు శైలేష్ మరణవార్తను కుటుంబ సభ్యులు ఇంకా చెప్పలేదు. డాక్టర్ల పర్యవేక్షణలో ప్రత్యేక అంబులెన్స్ లో ఆయనను లక్నోకు తరలించే ఏర్పాట్లు చేశారు. అంత్యక్రియలు, అనంతరం పదమూడు రోజుల కార్యక్రమం ముగిసేవరకు గవర్నర్ లక్నోలోనే ఉంటారని సమాచారం