తప్ప తాగి... స్నేహితులతో కలిసి

27 May 2015

హైదరాబాద్: తప్ప తాగి... స్నేహితులతో కలిసి కారు రేసింగ్ చేస్తూ ఓ వ్యక్తి సిగ్నల్ వద్ద నిలిపి ఉన్న బైక్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న సాప్ట్వేర్ ఇంజినీర్ దుర్మరణం చెందగా... ఆమె భర్త, కుమారుడికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో మూడు కార్లు ధ్వంసమయ్యాయి.
రేసింగ్ వల్లే ప్రమాదం...

డెలాయిట్ కంపెనీలో హెచ్‌ఆర్ మేనేజర్‌గా పనిచేసే శ్వేతాబ్‌కుమార్ తోటి ఉద్యోగులు ఐదుగురిని తీసుకొని రేసింగ్‌కు బయలుదేరాడు. శంషాబాద్ నుంచి మితిమీరిన వేగంతో వస్తూ బైక్, కార్లను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. పోలీసులు కారులో ఉన్న బీరు సీసాలు, సిగరెట్లు స్వాధీనం చేసుకున్నారు. స్కోడా కారులో ఉన్న శ్వేతాబ్ కుమార్‌తో పాటు వినోద్, రిషాబ్, శ్రీవాత్సవలకు గాయాలయ్యాయని పోలీసులు చెప్పారు.