ఎర్రబెల్లి దయాకర్‌రావుపై కేసు నమోదు

5 Aug 2015

వ‌రంగ‌ల్ జిల్లా పాల‌కుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు పై వరంగల్‌పట్నం లోని మిల్స్‌కాలనీ పోలీసుస్టేషన్‌లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతోపాటు హత్యాయత్నం కేసు  సోమవారం రోజున నమోదైంది. 

ఆదివారం జరిగిన టీడీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో బాగంగా రాంలక్ష్మణ్ గార్డెన్‌లో ప్రొటోకాల్‌పై ఉమ్మడి వికలాంగుల సంస్థ డైరెక్టర్ కంప వినోద్‌కుమార్ పై దాడికి దిగారు. విక‌లాంగుడినైన తనని హేళన చేసి మాట్లాడడం కాకుండా హత్య యట్నంకు ప్రయత్నించారు అని తెలిపారు. కంప వినోద్‌కుమార్ ఫిర్యాదుపై కేసు న‌మోదు చేసి ఎర్రబెల్లి దయాకర్‌రావుపై దర్యాప్తు చేస్తునమని పోలీస్ లు తెలిపారు.