ప్రత్యూష కేసు ఈనెల 27వ తేదీకి వాయిదా

21 Jul 2015

ప్రత్యూష ఆరోగ్యం మెరుగై ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జి అయిన అనంతరం హైకోర్టులో హాజ‌రు ప‌ర‌చాల‌ని ధ‌ర్మాస‌నం ప్ర‌భుత్వానికి ఆదేశించింది. ప్రత్యూష పూర్తిగా కోలోకోడానికి మరో వారం సమయం ఉండడటం లో ధర్మాసనం తగిన విధంగా కోర్ట్ లో ప్రవేశ పెట్టాలని సూచించింది.

క‌న్న‌తండ్రి, స‌వతి త‌ల్లి చేతిలో చిత్ర‌హింస‌ల‌కు గురైన  ప్రత్యూషను మ‌రో వారం రోజుల చికిత్స అవసరం అని , ఆమెను కోర్టులో హాజ‌రుప‌ర‌చ‌లేక పోయామ‌ని ప్ర‌భుత్వ లాయ‌ర్ తెలిపారు. అనంతరం ఈ కేసు త‌దుప‌రి విచార‌ణ‌ను ఈనెల 27వ తేదీకి వాయిదా వేసింది.