మూడవ రోజు కొనసాగుతున్న వైఎస్ జగన్ రైతు భరోసా యాత్ర

23 Jul 2015

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షడు జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన రైతు భరోసా యాత్ర ఎ ఆటంకాలు లేకుండా ప్రశాంత వాతావరణం తో జరుగుతుంది. కాగ చేపట్టిన రైతు భరోసా యాత్ర ప్రస్తుతం అనంతపురం జిల్లా లో గురువారం ఉదయం కల్యాణదుర్గం నుంచి యాత్ర ప్రారంభమైంది. 

ఈ రోజు వైఎస్ జగన్ కల్యాణదుర్గం, పెనుకొండ నియోజక వర్గాల్లో నాలుగు కుటుంబాలను పరమర్సిస్తునట్లు సమాచారం. ముందుగా ఆత్మహత్యకు పాల్పడిన నారాయణప్ప కుటుంబాన్ని ఆయన పరామర్శించి అనంతరం ఒంటాపల్లి చేరుకుని  రామాంజనేయులు కుటుంబాన్ని, తర్వాత పెనుకొండ నియోజక వర్గం రొద్దం మండలం వైటీ రెడ్డిపల్లిలో లక్ష్మీదేవి కుటుంబాన్ని చివరగా పెద్ద పాతన్న కుటుంబాలను కలవనున్నట్లు సమాచారం.