రుద్రమ దేవి యాడ ఉంది ?

3 Jun 2015

అప్పుడెప్పుడో ఆడియో విడుదల ని పూర్తి చేసుకున్న రుద్రమ దేవి సినిమా విడుదల ఇంకా ఖరారు కాలేదు , ఈ సినిమా విడుదల కోసం పెద్దగా ఆసక్తి గా ఎవరూ ఎదురు చూడక పోయినా బాహుబలి లాంటి సినిమా కి తమ హీరో సినిమా పోటీ ఇస్తుంది అని ఆశించిన అల్లు అర్జున్ ఫాన్స్ మాత్రం కొద్దో గొప్పో ఆశలతో ఉన్నారు.ఇప్పుడు ఈ సినిమాను జూన్ లో గానీ జులైలో గానీ మన ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ‘బాహుబలి’ జులైలో వస్తుందని ప్రకటించడంతో రుద్రమదేవిని అంతకంటే ముందు దింపాలని ఆలోచిస్తున్నారట. ఇంకా ఫైనాన్షియల్ సమస్యలు వుండడంతో విడుదలతేదిపై స్పష్టత లేదు.