ఒక వీడియో చూస్తే పది రూపాయలు

5 Jun 2015

గ్రామీణ మహిళలకు మొబైల్ ఫోన్ల ద్వారా ఆరోగ్యం-పౌష్టికాహారంపై అవగాహన కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం వినూత్న పద్ధతికి శ్రీకారం చుట్టింది. మహిళల ఆరోగ్యం-పౌష్టికాహారంపై కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ నాలుగు వీడియోలను రూపొందించింది. 18 భాషల్లో ఉన్న ఈ వీడియోలను డౌన్ చేసుకుని వీక్షించిన వారికి రూ.10 నజరానాగా ఇవ్వనున్నట్లు కేంద్రం ప్రకటించింది. 2018 నాటికి రెండున్నర కోట్ల మంది గ్రామీణ మహిళలకు పౌష్టికాహారం, ఆరోగ్యంపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం ఈ వినూత్న పథకానికి నిన్న శ్రీకారం చుట్టింది. ఇండియన్ అకాడెమీ ఆప్ పీడియాట్రిక్స్, యూనీసెఫ్, హెల్త్ ఫోన్-వోడాఫోన్ సంస్థల భాగస్వామ్యంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో వీడియోలు వోడాఫోన్ చందాదారులకు ఉచితంగానే అందనున్నాయి.