సంవత్సరాల నుంచీ ఎదురు చూస్తున్న పులి

3 Jun 2015

కొచ్చాడియాన్ , లింగా సినిమాలతో ఒక రకమైన ఇబ్బందుల్లో పడ్డ రజనికాంత్ తన తదుపరి సినిమా ఎప్పుడు ప్రకటిస్తాడా అని అందరూ ఎదురు చూస్తున్న నేపధ్యం లో రజిని అందరినీ ఆశ్చర్య పరుస్తూ రెండే రెండు సినిమాలు దర్సకత్వం వహించిన రంజిత్ అనే కుర్రాడికి దర్శకుడిగా అవకాశం ఇచ్చాడు. అతకత్తి, మద్రాస్ సినిమాలు రజినీకాంత్ కి పర్సనల్ గా  నచ్చడమే కాక కమర్షియల్ గా కూడా మంచి పేరు ఒచ్చింది దాంతో సీనియారిటీ ని ప్పక్కన పెట్టి ఈ సినిమా కి రజిని ఓకే చెప్పారు . కళ్ళై పులి ఈ చిత్రానికి నిర్మాత. అప్పట్లో భైరవి అనే చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరించిన తనకి రజినీకాంత్ ని ప్రొడ్యూస్ చేసే అవకాశం రావడం తో ఫుల్ హ్యాపీగా ఉన్నాడు పులి. ఆ సినిమా ముప్పై ఐదు సంవత్సరాల క్రితం నిర్మాణం అయ్యింది ఇప్పుడు ఈ సినిమా కి నిర్మాత గా చాన్స్ వచ్చింది. అంటే ముప్పై ఐదు సంవత్సరాల నుంచీ రజిని తో అవకాసం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను అని చెప్పుకొచ్చాడు పులి.