చంద్రబాబు మొత్తం కథ నడిపించాడు - హరీష్ రావు

3 Jun 2015

ఓటుకు నోటు వ్యవహారాన్ని అంది పుచ్చుకున్న హరీష్ రావు ఇప్పుడు టీడీపీ ని టార్గెట్ చేసారు . మండలి ఎన్నికల లో అభ్యర్ధి ని గెలిపించుకునే సంఖ్యలో ఎమ్మెల్యే లు లేకపోయినా కూడా టీడీపీ గట్టి పోటికి పెట్టి పక్క పార్టీ ఎమ్మెల్యే లను డబ్బులు ఇచ్చి కొనుగోలు చేసి గెలవాలని అనుకుంది అని , వారిది వెన్ను పోటు విధానం అని హరీష్ రావు ఎద్దేవా చేసారు.” తెలుగు దేశం పార్టీ ది రాజకీయ వ్యభిచారం ” అంటూ హరీష్ రావు తెలంగాణా ఎమ్మెల్యే మండి పడ్డారు.చంద్రబాబు డెరైక్షన్‌లోనే రేవంత్ డబ్బు కట్టలు పట్టుకుని తిరిగారని, ఈ మొత్తం వ్యవహారానికి సూత్రధారి బాబు అయితే, పాత్రధారి రేవంత్ అని హరీశ్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు రాజకీయ జీవితమే వెన్నుపోటు రాజకీయాల పుట్టుకని, బాబు అవినీతిని ప్రజలు మరిచిపోరన్నారు.