వీళ్ళని భరించలేక పోతున్నాను పీకేయండి - నరసింహన్

12 Jun 2015

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో తాను విసిగిపోయానని, ఇక వేగలేనని, సాధ్యమైనంత త్వరలో తప్పించాలని ప్రధాని నరేంద్రమోదీకి గవర్నర్ నరసింహన్ విజ్ఞప్తి చేసుకున్నారు. నిన్న సాయంత్రం ప్రధానిని కలిసిన ఆయన రెండు రాష్ట్రాల సీఎంల మధ్యా జరుగుతున్న కోల్డ్ వార్ పై ఓ నివేదికను సైతం సమర్పించారు. రేవంత్ రెడ్డి వ్యవహారం, ఫోన్ ట్యాపింగ్ గోల, ఉమ్మడి రాజధానిలో సెక్షన్-8 అమలు తదితరాలపై మోదీతో చర్చలు జరిపారు. తాను చెప్పేదానిని ఇద్దరూ వినడం లేదని, వారిని దారిలో పెట్టడం కష్టతరంగా మారిందని చెప్పి, తనను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరినట్టు తెలుస్తోంది. అయితే, పరిస్థితి కొంత చక్కబడేవరకూ వేచి చూడాలని మోదీ సూచించినట్టు సమాచారం.