టీడీపీ నుంచి వైకాపా లోకి వలసలు

7 Jun 2015

సదుం మండలం కంభం వారి పల్లె పంచాయతీ బలిజ పల్లె కి చెందిన పలువురు పెద్ద నాయకులు టీడీపీ నుంచి వై కా పా కి చేరారు. ఎమ్మెల్యే పెద్దిర్ రెడ్డి రామచంద్రారెడ్డి , ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, వైఎస్సార్ సీపీ పుంగనూరు నియోజకవర్గ కన్వీనర్ పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం వైఎస్‌ఆర్‌సీపీలో చేరారు. దాదాపు 15 కుటుంబాలకు చెందిన 50 మంది పార్టీలో చేరారు. వీరికి కండువా కప్పి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు.వెంకటరమణ, శ్రీనివాసులు, ఆదినారాయణ, రెడ్డెప్ప, రామాంజులు, రామ్మూర్తి, ఖాదర్‌బాష, రఫీ, మణికంఠ, గురవయ్య వీరంతా టీడీపీ లో క్రియా సీలంగా వ్యవహరించేవారు ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు చేస్తాం అన్న రుణమాఫీ, రైతులకు ఇస్తాం అన్న రుణమాఫీ విషయం లో చేస్తున్న అబద్దపు రాజకీయాలు చూడలేకే విసుగెత్తి పలువురు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. అంతకుముందు గ్రామంలో ఎమ్మెల్యే కి  ఘనస్వాగతం లభించింది.