సుప్రీం మాటకి లోబడి ప్రచారం

3 Jun 2015

సుప్రీం కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం తో ఎక్కడా పత్రికల్లో ప్రకటనలు ఇచ్చేటప్పుడు ఫోటోలు వాదం లేదు తెలంగాణాలో , దీని గురించి అధికార పక్షం పలు జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వం అప్పట్లో భారీగా ఖర్చు కూడా పెట్టి ప్రచారం చేసేవారు కానీ ఇప్పుడు అదే రేంజ్ లో ప్రచారం అయితే చేస్తున్నారు కానీ ఎక్కడా అధినేతల ఫోటోలు రాకుండా చూసుకుంటున్నారు. ప్రభుత్వ పథకాలు వాటి లభ్దిదారుల ఫోటోలు కీలకం గా ప్రచారం చేస్తున్నారు. రాష్ట్ర ప్రతి , ప్రధాన మంత్రి , సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఫోటోలు తప్ప ఇంకా ఎవ్వరి ఫోటోలు ప్రభుత్వ పథకాల విషయం లో వినియోగించకూడదు అనే తీర్పుని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఇవాళ కెసిఆర్ ప్రభుత్వం గద్దెనెక్కి సంవత్సరం అయిన నేపద్యం లో మాములుగా అయితే ముఖ్యమంత్రి నిలువెట్టి ఫోటోలు ప్రచురణ చేసేవారు కానీ సుప్రీం ఇచ్చిన ఈ తీర్పుకి లోబడి తగ్గిపోయారు మనవారు.