పాతవి పోయాయి , కొత్తవి రాలేదు

5 Jun 2015

అధికారం లోకి వచ్చి ఏడాది కావస్తున్నా శ్రీకాకుళం లో రేషన్ కార్డుల విషయం లో కూడా ఊపు అందుకోలేక పోయింది ఏపీ సర్కారు.  గడచిన బాబు ఏడాది పాలనలో పాత రేషన్‌కార్డులు పరిశీలన పేరుతో తొలగించారు. కొత్తవాటి కోసం అర్జీలు పెరుగుతున్నా మంజూరు చేసిన పాపాన పోలేదు. ప్రజలు నిరంతరం మీ సేవలోనూ, తహశీల్దారు కార్యాలయాల్లోనూ, గ్రామాలకు వచ్చిన ప్రజా ప్రతినిధులకు, ఆధికారులకు అర్జీలు పెడుతూనే ఉన్నారు. ఇప్పటికే వడబోత పేరుతో జిల్లాలో దాదాపు 32వేల కార్డులను అనర్హత పేరుతో తొలగించేసిన సర్కారు వాటి పునరుద్ధరణకు సవాలక్ష ఆంక్షలు పెడుతోంది.ఏదో వక వంక ని చొప్పిస్తూ కస్టపడి వచ్చిన జనాలని నీరు గార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి తప్ప ఒక్క ప్రజా ప్రతినిథి కూడా ముందుకు వచ్చి తమకి పని జరిగేలాగా ఆడరింకాహ్డం లేదు అని జనం మండి పడుతున్నార్