మనో ధైర్యం అందించడం కోసం షర్మిల నడుం బిగించారు

6 Jun 2015

వై ఎస్ రాజ శేకర్ రెడ్డి లాంటి గొప్ప నాయకుడు మరణించిన తర్వాత గుండె ఆగి పోయి మరణించిన వారి సంఖ్యా అనేకం, అలాంటి వారి కోసం జగన్ మోహన్ రెడ్డి చెల్లెలు – వై ఎస్ కూతురు షర్మిల పరామర్శ యాత్ర చేపడుతూ ఉన్నట్టు వై కా పా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే శివకుమార్ తెలిపారు. ఈ నెల 9 నుంచీ నల్గొండ లో ఈ పరామర్శ యాత్ర ఉంటుంది అని పోస్టర్ లను కూడా విడుదల చేసారు. యాదగిరి గుట్టలో వీటిని ఆవిష్కరించారు పార్టీ సభ్యులు. శివకుమార్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ వై ఎస్ మృతి వార్త విన్నవెంటనే అలాంటి ద్రువతార రాలిపోయింది అని తాము కూడా మరణించిన వారు తెలంగాణా రాష్ట్రం లో ఎంతో మంది ఉన్నారు అని వారి అందరి  కుటుంబాలను పరామర్శిస్తామని గతంలోనే తమ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారని గుర్తు చేశారు. ఈ మేరకు మృతుల కుటుంబాలను పరామర్శించి, వారిలో మనోధైర్యం నింపేందుకు షర్మిల ఈ యాత్రను చేపడుతున్నారని పేర్కొన్నారు.