రాష్ట్రానికే సిగ్గు చేటు

5 Jun 2015

అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేద్దామంటూ.. చంద్రబాబు నాయుడు ప్రమాణం చేయించడం సిగ్గుచేటు అని చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. ఓటుకు నోటు పద్ధతిలో ఎమ్మెల్యేను కొనబోయి అడ్డంగా బుక్కైన ఘటన మరువక ముందే మంత్రి ఇంట్లో రూ.10లక్షలు దొరకడం చూస్తే టీడీపీది ఎంత అవినీతి చరిత్రో అర్థమవుతుందని ఆయన బుధవారమిక్కడ వ్యాఖ్యానించారు. సమర దీక్షతో చంద్రబాబు మోసపూరిత వైఖరిని ఎంగడతామని తెలిపారు.