సమరదీక్ష సూపర్ సక్సెస్

6 Jun 2015

వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళగిరిలో నిర్వహించిన సమరదీక్షకు ప్రజలు స్వచ్ఛందంగా భారీ సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేశారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నియోజకవర్గ సమన్వయకర్త కారుమూరి వెంకట నాగేశ్వరరావు తెలిపారు. శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు ఏడాది పాలనపై విసుగెత్తిన ప్రజలు సమరదీక్షకు పోటెత్తారన్నారు. అన్నివర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి సంఘీభావం తెలిపారని కారుమూరి చెప్పారు. జన స్పందనను చూసి ఈర్ష పడిన ప్రభుత్వం దీక్షా శిబిరం వద్ద కనీస భద్రత కూడా ఏర్పాటు చేయలేదని, ప్రతిపక్ష నేతకు ఇచ్చే గౌరవం ఇదేనా అని ఆయన ప్రశ్నించారు. జిల్లాలో టీడీపీ ప్రజాప్రతినిధులు ప్రజాధన దోపిడీకి పాల్పడుతున్నారన్నారు. చెరువులను తవ్వే పేరుతో గట్లు పటిష్టం చేయకుండా నిబంధనలకు విరుద్ధంగా మట్టిని తెగనమ్ముకుంటున్నారని కారుమూరి విమర్శించారు.