పూరి తమ్ముడు లాయర్ అయ్యాడు

6 Jun 2015

రకరకాల గెటప్ లలో ఇప్పటివరకూ దర్శనం ఇచ్చిన పూరి జగన్నాథ్ తమ్ముడు సాయి రాం శంకర్ ఇప్పుడు తన కొత్త సినిమా ‘వాడు నేను కాదు’ చిత్రంలో క్రిమినల్ లాయర్_ పాత్రను పోషించనున్నాడు.  హైదరాబాద్ లో ఈ మధ్యనే మొదలైన ఈ సినిమా షూటింగ్ సేరవేగంగా సాగుతోంది. సస్పెన్స్ తో పాటు మంచి కథాంశం తో ఈ సినిమా ఉంటుంది అని దర్శకుడు వినోద్ విజయన్ తెలిపారు. క్రిమినల్ లాయర్ గా ఒక పెద్ద పజిల్ ని ఎలా చేధించాడు అనేది కథాంశం గా సాగుతున్న ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చితుంది అన్నారు యూనిట్ సభ్యులు. ఒకేసారి తెలుగు , తమిళ , మళయాళ , కన్నడ , భోజ్ పూరి భాషలలో ఈ సినిమా ని నిర్మిస్తున్నారు. హీరో సాయిరాం శంకర్_కి దర్శకుడు విజయన్_కు మధ్య గత కొద్ది సంవత్సరాలుగా ఈ చిత్ర కథపై జరిగాయని… అయితే అవి ఇటీవల కొలిక్కి రావడంతో ఈ చిత్ర షూటింగ్ ప్రారంభమైందని వివరించింది బృందం