కడప ఎయిర్పోర్ట్ కి సర్వం సిద్దం

7 Jun 2015

తిరుమల గిరికి తొలి గడప గా చెప్పుకునే కడప జిల్లా కి కొత్త కళ రాబోతోంది, వాణిజ్య పరంగా విమాన సేవలు అందుబాటులోకి రావడం తో అంతా సంతోషంగా ఉన్నారు,ఈ నెల 7 నుంచీ కడప విమానాశ్రయం ప్రారంభం అవుతోంది ఈ విషయాన్ని పౌర విమాన శాఖ అధిపతి అశోక్ గజపతి రాజు ప్రకటించారు.దీనికి చంద్రబాబు తో ఓపెనింగ్ చేయిస్తారు. మొదటి సర్వీసు విమానం బెంగళూరు నుంచి కడపకి చేరుకుంటుంది , ఉదయం 11 30 నిమిషాలకు కడపకి అర్రైవ్ అవుతుంది విమానం. ఈ విమానానికి వాటర్ క్యాన్లతో స్వాగతం పలకబోతున్నారు. అదే విమానం తొలి సర్వీసు గా బెంగళూరు కి కాసేపటి తరవాత బయలు దేరుతుంది. సుమారు 42 కోట్లు పెట్టి ఈ విమానాశ్రయం ఏర్పాటు చేసారు ఏ టీ ఆర్ 72 తరహా విమానాలు రాకపోకలు సాగిస్తాయి.