పోలీసు ఇంట్లో దొంగతనం

6 Jun 2015

హైదరాబాద్ నగరం లో దొంగలు తమ చేతి వాతం చూపించారు, పోలీసుల ఇళ్ళలోకి దూరి దొంగతనాలు చెయ్యడం మొదలు పెట్టడం కాస్త వింతగా అనిపించే విషయం. పెట్ బషీర్ బాద్ లో ఇన్స్పెక్టర్ శంకర్ యాదవ్ ఇంట్లో శుక్రవారం దొంగలు పడ్డారు ఈ సంఘటన బోయినపల్లి లో ఏస్బీసీ కాలనీ లో జరిగింది. శంకర్ యాదవ్ ఇంట్లో లక్ష రూపాయల డబ్బు, ఎనిమిది తులాల బంగారాన్ని దొంగలు ఖాళీ చేసారు. దాంతో పాటు 10 తూటాలు ఒక రివాల్వర్ కూడా పోయింది అని ఇన్స్ పెక్టర్ శంకర్ ఫిర్యాదు చేసాడు. పోలీసులే తిరిగి తమ ఎస్సై ఇంట్లో జరిగిన దొంగతనం మీద దర్యాప్తు చేపట్టారు.