రేవంత్ విచారణ మొదలయ్యింది

6 Jun 2015

ఓటుకు నోటు కేసులో ప్రస్తుతం చర్లపల్లి లో ఉన్న రేవంత్ రెడ్డి ని శనివారం ఏ సి బీ అధికారులు తమ కస్టడీ లోకి తీసుకున్నారు. ఆయనను ఏసీబీ కార్యాలయానికి తరలించి విచారణ చేపడుతున్నారు పోలీసులు .రేవంత్ తో పాటు సహా నిందుతులు అయిన రుద్రా ఉదయ సింగ్ ను , సెబాస్టియన్ ను కూడా నాలుగు రోజులు కస్టడీ కి ఇచ్చింది కోర్టు. శనివారం నుంచి 9వ తేదీ వరకు రోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారణ జరపనున్నారు.