రేవంత్ కి మంచినీళ్ళు కూడా ఇవ్వట్లేదు - న్యాయవాది

7 Jun 2015

ఏ సి బీ ఒక పక్క వోటు కు నోటు కుంభకోణం లో రేవంత్ రెడ్డి ని విచారణ చేస్తుంటే రేవంత్ లాయర్ ల వైఖరి వేరేలాగా ఉంది , రేవంత్ కి మంచినీళ్ళు ఇవ్వడానికి కూడా పోలీసులు అంగీకరించడం లేదు అని వారు వాపోతున్నారు . దుస్తులు మార్చుకునే అవకాశం ఇవ్వకుండా టార్చర్ పెడుతున్నారు అని , గంటలకి గంటలు కుర్చీ లో కూర్చో బెడుతున్నారు అని చెబుతున్నారు .తీవ్ర అనారోగ్య సమస్యల తో సతమతం అవుతున్న రేవంత్ రెడ్డి ని పోలీసులు ఇబ్బంది పెడుతూ దారుణంగా ప్రవర్తిస్తున్నారు అని రేవంత్ తరఫున లాయర్ ఆరిపించారు. రేవంత్ పట్ల పోలీసుల దురుసు వైఖరి ని కోర్టుకు ఫిర్యాదు చేయ్యబోతునట్టు ఆయన తెలిపారు.