బాహుబలి పై రాం గోపాల్ వర్మ పొగడ్తలు

3 Jun 2015

రాం గోపాల్ వర్మ సినిమా కంటే కూడా జనాలు ఆయన చేసే ఆసక్తి కర కామెంట్ లేక్ ఎక్కువ మొగ్గు చూపుతున్నారు ఈ మధ్య కాలం లో, నిన్న విడుదల అయిన బాహుబలి ట్రైలర్ కోసం అందరిలాగానే తానూ ఎదురు చూసాను అని చెప్పుకొచ్చిన వర్మ  ఆ సినిమా ట్రైలర్ వంద మార్కులకి డబ్భై మార్కులు వేసారు. ఈ సినిమా భారత దేశ సినిమా చరిత్ర లో ఒక తాజ్ మహల్ లాంటిది అని బాహుబలి లాంటి అద్భుతాన్ని ఊహించడానికే అసాధ్యం అని అలాంటిది దాన్ని తెరమీద ఆవిష్కరించడానికి ఎంతో మానసిక ధైర్యం కావాలని వర్మ అన్నాడు. భారతీయ సినిమా లో బాహుబలి కచ్చితంగా ఒక కొత్త అధ్యాయం , ఈ సినిమా కొన్ని దశాబ్దాల బాటు భారతీయ సినిమా కి రిఫరెన్స్ గా ఉపయోగ పడుతుంది అని చెప్పుకొచ్చాడు రామూ