టీ పోలీసుల పైన ఆంధ్రా పోలీసుల కేసులు - బాబు ఫోన్ ట్యాప్ చేసినందుకే

7 Jun 2015

ఓటుకు నోటు విషయం లో తమని నిండా ముంచింది కెసిఆర్ సర్కారు ఐనా దీనికి తెలంగాణా పోలీసులు బాగా హెల్ప్ చేసారు అని ఆంద్ర ప్రదేశ్ భావిస్తోంది దీంతో ఈ విషయం లో తిరిగి వారిని ఇబ్బంది పెట్టేందుకు తమ ముఖ్య మంత్రి ఫోన్ లైన్ లానే ట్యాప్ చేస్తారా అంటూ తిరిగి వారిపైనే కేసులు పెట్టారు ఆంధ్రా పోలీసులు. పోలీసులు ట్యాప్ చేసిన ఫోన్ ల దర్యాప్తును ప్రారంభించిన పోలీసులు ప్రభుత్వానికి ప్రాధమిక నివేదిక సమర్పించారు ఇందులో పలు సంచలన విషయాలు వెల్లడి అయ్యాయి. చంద్రబాబు ఫోన్ తో పాటు ఆయన చుట్టూరా ఉండే ముఖ్య అధికారుల ఫోన్ లు కూడా ట్యాపింగ్ జరుగుతోంది ఇది చేస్తోంది కూడా తెలంగాణా పోలీసులే అని బయట పడింది; దీని పైన మరింత సమాచారం వచ్చాక వారి మీద కేసులు కూడా పెట్టె యోచన చేస్తున్నారు