పవన్ కళ్యాణ్ నీ వాళ్ళని అదుపులో పెట్టుకో

7 Jun 2015

బీ జే పీ పార్టీ లో ఏ పీ లో అందరూ సైలెంట్ గా ఉన్నా కూడా శివాజీ విషయం లో కానీ మరేదైనా విషయం లో కానీ సోము వీర్రాజు మాత్రం తనదైన శైలి లో మీడియా లో మాట్లాడుతున్నారు అయితే పవన్ కళ్యాణ్ ఫాన్స్ అంటూ జనసేన తరఫున నిన్న విజయవాడ లో వెంకయ్య నాయుడు కి వ్యతిరేకంగా నినాదాలు చేసిన కొందరు విద్యార్థుల పైన వీర్రాజు మండి పడ్డారు. ఓపెన్ గానే పవన్ పైన ఫైర్ ఐన వీర్రాజు పవన్ కళ్యాణ్ తన వారిని అదుపులో పెట్టుకోవాలి అని కోరారు. వెంకయ్య న్ని రాజీనామా కోరే హక్కు ఎవ్వరికీ లేదు అని తెలిపిన ఆయన ఈ ప్రత్యెక హోదా విషయం లో రాద్దాంతం సరైనది కాదు అని అభిప్రాయ పడ్డారు. వెంకయ్య నాయుడు దయవల్లనే ఇప్పటివరకూ రాష్ట్రానికి రావలసిన నిధులు సకాలం లో వస్తున్నాయి అని పేర్కొన్నారు ఆయన. పవన్ కళ్యాణ్ – వీర్రాజు ఇద్దరూ మంచి మిత్రులు అవడం గమనార్హం.