nagaram-inka-nidrapothundi

7 Jun 2015

ఆదివారం ఉదయం చల్లగా ఇంకా దుప్పట్లోనే తొంగున్నారు హైదరాబాద్ వాసులు, చక్కగా చల్లగా ఉండడం తో ఈ విధంగా సేదతీరుతున్నారు అందరూ. భాగ్యనగర వాసులకు ముసురు తో ఎంజాయ్ చేస్తున్నారు. నిన్న మొన్న వరకూ భరించలేని ఎండ మరొక పక్క ఉక్కపోత చెమటలతో విసుగు ఎత్తుకు పోయిన హైదరాబాద్ నగరం గత రెండు రోజుల నుంచీ పడుతున్న వర్షాల తాకిడి కాస్త కుదురుకుంది అనే చెప్పాలి. ఆకాశం కూడా మేఘావృతం కావడం తో కాస్త చీకటి అలుముకుని ప్రస్తుతం అందరికీ సంతోషం గా ఉంది. సూర్యుడు మబ్బులు చాటున దాక్కోవడంతో ఉదయం 10 గంటలైనా వెలుతురు జాడే లేదు. సెలవు రోజు కూడా కావడంతో భాగ్యనగర వాసులు మంచం దిగేందుకు ఇష్టపడలేదు.