మోదీ పర్యటన 'చారిత్రాత్మకం' మోసేస్తున్న ఆ దేశ మీడియా

7 Jun 2015

అన్ని దేశాలని టూర్లు వేస్తున్న ప్రధాన మంత్రి మోడీ ఇప్పుడు బంగ్లాదేశ్ లో తేలారు , ఆ దేశ మీడియా ఈ విషయం మీద బాగా సీరియస్ గా సంతోష పడుతోంది. భారీ ప్రచారం కూడా ఆయన పర్యటన కి బంగ్లాదేశ్ ప్రభుత్వం అందించింది. ” ఈ పర్యటన చారిత్రాత్మకం ” అంటూ అక్కడి పత్రికలూ టీవీలు మోడీ ని అందలం ఎక్కిస్తున్నాయి. మోడీ రెండు రోజుల పర్యటన కు అక్కడి మీడియా బ్రహ్మరధం పడుతోంది అంటే అది చిన్న మాట అవుతుంది ఏమో. దిన పత్రికలూ , వార్తా చానళ్ళు , సోషల్ మీడియా ఇలా ఒకటేవిటి రకరకాలు గా మోడీ పర్యటన తో బంగాలదేశ్ తడుస్తోంది. రకరకాల ఒప్పందాల పైన కూడా మోడీ తో పాటు ఆ దెస ప్రధాని సంతకం చెయ్యాల్సి ఉంది.