సినిమాలకి మెగా స్టార్ గుడ్ బై ?  

3 Jun 2015

చిరంజీవి 150 వ చిత్రం ఓకే అవ్వడం తో చిరంజీవి ఇంక రాజకీయాలకి టాటా చెప్పెసినట్టే అంటున్నారు అంతా . కాంగ్రెస్ కి ఆంధ్రా లో భవిష్యత్తు లో ఎలాంటి అవకాశం లేకపోవడం తో పార్టీ కి నెమ్మదిగా గుడ్ బై చెప్పి సినిమాలలో మకుటం లేని మహారాజు గా సాగాలని కోరుకుంటున్నారు . చిరు కాంగ్రెస్ ను వీడి వేరే పార్టీ లోకి వెళ్ళలేక పోవటం తో, రాజకీయాల నుంచి వైదొలిగితేనే మంచిదని సూచనలు వినిపిస్తిన్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యునిగా కొనసాగుతున్న చిరు తన పదవీ కాలం 2018 వరకు ఉండటం తో, ఆ పదవిని అలాగే ఉంచుకొని ఆంధ్ర ప్రదేశ్ లో చలన చిత్ర పరిశ్రమను అభివృద్ధి చేయటం లో కృషి చేయాలని పలువురు సూచిస్తున్నారట. ప్రస్తుతం జరుగున్న కాంగ్రెస్ కార్యకరమాలలో కూడా చిరు పెద్ద ఆసక్తి గా పాల్గొనక పోవడం ఎదో హాజరు కోసం రావడం వంటివి దీన్ని సూచిస్తున్నాయి