జన్మ భూమి - మా ఊరు లో గొడవ

7 Jun 2015

ప్రభుత్వ స్థలాన్ని వదిలేసి టీడీపీ నేతలు చెప్పిన చోటనే  ‘జన్మభూమి-మాఊరు’ కార్యక్రమం నిర్వహించడం వివాదాస్పదమైంది. పార్వతీ పురం రూరల్ లో ఎమ్మార్ నగరం లో పంచాయతీ కార్యాలయం , పాఠశాల భవనాలు ఇంకా ఎన్నో ప్రభుత్వ స్థలాలు ఖాళీగా ఉన్నాయి టీడీపీ నేతలు మాత్రం సత్యనారాయణస్వామి ఆలయం వద్ద గురువారం ‘జన్మభూమి-మాఊరు’ ఏర్పాటు చేశారు. వేదిక నిండా టీడీపీ నేతలే కూర్చోవడంతో అది పార్టీ కార్యక్రమాన్ని తలపించింది. ప్రభుత్వం పెట్టిన నిభందనలను ఉల్లంఘించి జరుగుతోంది అన్న కారణం తో సర్పంచ్ రొంపిల్లి తిరుపతిరావు, ఎంపీటీసీ బడే రామారావు, వార్డు సభ్యులు, పలువురు వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద ఎత్తున వెళ్లి అధికారులను నిలదీశారు.