బాబుపై పైన రెచ్చిపోయిన జగన్

7 Jun 2015

సమారా దీక్ష ముగింపు సభలో అత్యంత పెద్ద జన సమూహం తో మాట్లాడిన జగన్  కోపం తో జగన్ మోహన్ రెడ్డి రెచ్చిపోయారు, చంద్రబాబు సర్కారు ఆంద్ర ప్రజలకు చేస్తున్న దారుణాలని ఆయన దుమ్మెత్తి పోశారు. ఎన్నికలు గనక ఇప్పుడు మళ్ళీ వస్తే చంద్రబాబు కి డిపాజిట్లు కూడా దొరకవు అని అన్నారు, రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం, పదేళ్ల ప్రత్యేకహోదా… అప్పట్లో అన్ని టీవీల్లోనూ ఇవే మాటలు కానీ ఒక్కటి కూడా అమలు కాలేదు అని జగన్ కోపం తో అన్నారు.ఈ హామీలన్నీ సమైక్య రాష్ట్రంలో ఇచ్చానని, ఇప్పుడు అమలు సాధ్యం కాదంటున్నారు ఐడెమ్ మాట అలా అయితే రెండు రాష్ట్రాలకి రెండు మ్యానిఫెస్టో లు ఎలా ఇచ్చారు. భద్రతా సిబ్బంది లేకుండా చంద్రబాబు గనక గ్రామాల్లో తిరిగితే జనం ఆయన్ని రాళ్ళతో కొట్టడం ఖాయం.”టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి లంచమిస్తూ అడ్డంగా దొరికిపోయారు ఈయనేమో విజయవాడ వచ్చి అవినీతిరహిత రాజ్యం కావాలంటూ ప్రమాణం చేయిస్తారు.. ఇంతకన్నా సిగ్గుమాలిన నాయకుడు ఎవరైనా ఉంటారా?” అంటూ జగన్ ధ్వజం ఎత్తారు.