హైదరాబాద్ ని ముంచెత్తిన వాన

7 Jun 2015

హైదరాబాద్ ను నిన్న రాత్రి నుంచి ఇవాళ ఉదయం వరకూ వర్షం ముంచి ఎత్తింది, రాత్రి 9 గంటల సమయం లో మొదలు అయిన వాన పొద్దున్న వరకూ సాగుతూ నే ఉంది. దాదాపు నలుగు సెంటీ మీటర్ ల వాన నమోదు కాగా లోతట్టు ప్రాంతాలు అన్నీ జలమయం అయ్యాయి.ఈదురు గాలుల కారణం గా నగరం లో చాలా చోట్ల చెట్లు , హార్డింగ్ లు పడిపోయి విద్యుత్ తీగల మీద పడ్డాయి.దీని వలన చాలా ప్రాంతాలలో రాత్రి మొత్తం పవర్ లేకుండా ఉండాల్సి వచ్చింది ఉదయం వరకూ కరెంటు సిబ్బంది దీని పైన చర్య తీసుకుని అవన్నీ సరిచేసిన తరవాత కానీ కరెంటు ఇవ్వలేక పోయారు.