బంగారం స్మగ్లింగ్ చేస్తున్న సిబ్బంది - జెడ్డా లో దొరికాడు

7 Jun 2015

ఇటీవల బంగారం స్మగ్లింగ్ లలో భారీగా పట్టుబడుతున్నారు ప్రయాణీకులు అయితే ఈ అంశం లో ఇప్పుడు ఏకంగా సిబ్బందే దొరకడం వింతగా ఉంది. బంగారం స్మగ్లింగ్ వంటి విషయాలు ఎంత దూరం తీసుకు వెళతాయో కచ్చితంగా తెలిసిన ఒక ఉద్యోగి ఇలా చెయ్యడం దారుణం అంటున్నారు అందరూ. ఎయిరిండియాలో క్యాబిన్ క్రూ సిబ్బందిగా పనిచేస్తున్న ఓ వ్యక్తి బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్నాడన్న ఆరోపణలపై జెడ్డా విమానాశ్రయ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. జెడ్డా నుంచి కొచ్చికి ఈ విమానం బయలుదేరాల్సి వుంది. దీంతో 11 మంది క్యాబిన్ క్రూతో బయలుదేరాల్సిన విమానం 10 మందితోనే వెనుదిరిగి వచ్చింది. అయితే, తమ సంస్థకు చెందిన ఓ ఉద్యోగిని అక్కడి అధికారులు అదుపులోకి తీసుకున్నారని, కారణం మాత్రం ఇంకా తమకు తెలియదని ఏఐ అధికారి ఒకరు తెలిపారు. అతని అరెస్టుకు వెనుకగల కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని, తప్పు చేశాడని తేలితే చర్యలు తీసుకుంటామని వివరించారు.