జీ హెచ్ ఎంసీ ఎలక్షన్ టార్గెట్ గా కిషన్ రెడ్డి వ్యాఖ్యలు

7 Jun 2015

బీ జే పీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తమ పార్టీ ని హైదరాబాద్ లో బలోపేతం చేసుకునే పనిలో చాలా బిజీ గా ఉన్నారు. హైదరాబాద్ ప్రాంతం లో బీ జే పీ గెలుపు మాత్రమె నగరం అభివృద్ధి జరిగే అవకాసం ఉంది అన్నారు రెడ్డి. బాగ్ లింగం పల్లి లో జరిగిన బీ జే పీ మహాసంపర్క్ అభియాన్_లో కిషన్ రెడ్డి వెల్లడించారు. మోదీ పథకాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ బిజేపీ కార్యకర్తలకు పిలుపు నిచ్చారు.  జీ హెచ్ ఎంసీ ఎన్నికల నేపధ్యం లో కిషన్ రెడ్డి మాటలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. జీ హెచ్ ఎంసీ ఎలక్షన్ లో తెరాస నుంచి ఎలాగైనా పగ్గాలు తమవైపు తిప్పుకోవాలని గట్టిన ప్రయత్నిస్తోంది బీ జే పీ పార్టీ. ఆన్_లైన్_లో కొత్తగా సభ్యత్వాలు పొందిన వారిని ప్రత్యక్షంగా కలిసి పార్టీ సిద్ధాంతాలు, మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరించేందుకు భారతీయ జనతా పార్టీ మహాసంపర్క్ అభియాన్‌ను రూపొందించింది. మే 16 నుంచి జూలై 31 వరకు ఈ కార్యక్రమం చేపట్టనున్నారు. ఈ రోజు బాగ్_లింగంపల్లిలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో బిజేపీ నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.