బాబు చేసిన పని వల్లే ఇంత ఇబ్బంది

4 Jun 2015

సరిగ్గా ఇరవై సంవత్సరాల క్రితం ఇప్పుడు ముఖ్య మంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు అప్పుడు కూడా ముఖ్య మంత్రి గా ఉన్న విషయం తెలిసిందే అప్పట్లో ఆయన చేసిన ఒక చట్టం ఇప్పుడు కాంట్రాక్టు ఉద్యోగుల పాలిత శాపం గా మారింది. ఈ చట్టాన్ని సవరించాలి అని ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టింది. వివిధ ప్రభుత్వ విభాగాల్లోని దాదాపు 28 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులు లబ్ధి పొందుతారని అంచనా వేసింది. ఇందుకు విధివిధానాలను కూడా ప్రభుత్వం ఇటీవలే సిద్ధం చేసింది. కానీ కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌ను నిషేధిస్తూ 1994లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం చట్టాన్ని చేసింది. దీంతో ప్రస్తుతం ఇది అడ్డంకిగా మారింది. ఆ చట్టానికి సవరణ చేసేంత వరకు వేచి చూడాల్సి ఉంటుందని ఆర్థిక శాఖ అధికారులు వెల్లడించారు.చంద్రబాబు అనుకున్నదే తడవుగా రాబోయే క్యాబినెట్ సమావేశం లో దీన్ని పొందు పరిచి వెంటనే రెగ్యులరైజేషన్ కి పంపించ బోతున్నారు అని తెలుస్తోంది .అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు తో పాటు ప్రభుత్వ విభాగాలకు , స్థానిక సంస్థల కు పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు అందరికీ ఇది వర్తిస్తుంది .