మలేషియా లో భూకంపం

7 Jun 2015

భూకంపం ప్రకంపనలు సర్వత్ర భయ భ్రాంతులు వెలువరిస్తున్నాయి. ఆగ్నేయాసియాలో సంపన్న దేశంగా పేరుగాంచిన మలేసియాలో నేటి తెల్లవారుజామున భూకంపం సంభవించింది. బోర్నో ద్వీపంలో భూ ఉపరితలానికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు తేలింది. రిక్టర్ స్కేలుపై ఈ భూకంపం తీవ్రత 6.0గా నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. ఈ భూకంపం వల్ల జరిగిన నష్టం వివరాలు తెలియరాలేదు. భూకంపం నేపథ్యంలో సునామీ ప్రమాదమేమీ లేదని మలేసియా ప్రభుత్వం వెల్లడించింది.