అవినీతి కి చొక్కా ప్యాంటు వేస్తే అది చంద్రబాబు - రోజా

12 Jun 2015

వై కా పా నాయకురాలు రోజా తన దైన శైలి లో చంద్రబాబు నాయుడు మీద విరుచుకు పడ్డారు.గురువారం ఆమె తిరుపతి లో శ్రీవారిని దర్సిన్చుకున్ని ఈ సందర్భంగా ఓటుకు నోటు వ్యవహారం పైన ప్రశ్నించిన మీడియా తో మాట్లాడారు. చంద్రబాబు రాష్ట్రం పరువు ను బజారుకు ఈద్చారని.బయట ఎక్కడా ఆంద్ర ప్రాంతం వాడిని అని చెప్పుకోవడానికి జనం సిగ్గు పడుతున్నారు అని చెప్పారు . చిత్తూరు జిల్లా వాసిగా ఉండి జిల్లా వాసులు తలెత్తుకోలేని దౌర్భాగ్య పరిస్థితి కి వారిని బాబు నెట్టారు అని ఆమె ఆవేదన వ్యక్తం చేసారు. . ఏనాడు  చిత్తూరు జిల్లాభివృద్ధిని పట్టించుకోలేదని, సాగునీరు, తాగునీరే కాకుండా కనీసం ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించలేని చంద్రబాబు అవినీతి రాజకీయాలు చేయడం సిగ్గు చేటన్నారు.అవినీతి కి చొక్కా ప్యాంటు వేస్తే అది చంద్రబాబు అని ఆమె ఎద్దేవా చేసారు