జన్మభూమి పేరు చెబితే తిడుతున్నారు

5 Jun 2015

ఇచ్చిన హామీలు నెరవేర్చక పోవడం తో ప్రజా ప్రతినిథులు ఎవ్వరూ సాధారణ జనం దగ్గరకు వెళ్ళడానికి కూడా భయపడే పరిస్థితి ఏర్పడింది , ఏలూరు లో ప్రస్తుతం మాలి విడత జన్మభూమి పనులు మొదలు కావాల్సి ఉంది , అయితే పోయిన సంవత్సరం జన్మభూమి అర్జీలను పూర్తిగా పరిష్కరించని నేపథ్యంలో ఏడో తేదీ వరకు వీటిని  నిర్వహించాల్సి ఉండడంతో అధికారులు, ప్రజాప్రతినిధుల్లో గుబులు రేగుతోంది. 48 మండలాల్లోని 908 గ్రామాల్లోను, ఏలూరు నగరంతో పాటు ఏడు మునిసిపాలిటీలు, జంగారెడ్డిగూడెం నగర పంచాయతీలోను మొత్తం 289 వార్డులు, డివిజన్లల్లో జన్మభూమి- మా ఊరు సభలను నిర్వహిస్తారు. ఈ సభల నిర్వహణకు కోటి రూపాయలను ప్రభుత్వం ప్రణాళిక శాఖకు జమ చేసింది. హామీలనీ నెరవేర్చక , నిధులూ ఇవ్వక , పట్టణం చేరుకొని ఒక్క పని కూడా చేసుకోలేని అవస్థ లో ఉన్న జనాలు జన్మభూమి అంటే మండి పడుతున్నారు.డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తున్నామని చెప్పుకోవడానికి మలివిడత జన్మభూమి సభలను ప్రభుత్వం ఉపయోగించుకోవాలని చూస్తోంది. అయితే ప్రభుత్వం ఇప్పుడిచ్చేది రుణమాఫీ సొమ్ము కాదని, డ్వాక్రా పెట్టుబడి నిధి అని మహిళలకు నచ్చజెప్పేపని ప్రజాప్రతినిధులు, అధికారులపై పడింది