దీక్ష మొదలు , చంద్రబాబు ఏడాది పాలనే లక్ష్యంగా జగన్

5 Jun 2015

ప్రత్యెక హోదా విషయం లో జగన్ మోహన్ రెడ్డి తనదైన శైలి లో చంద్రబాబు పైన విరుచుకు పడ్డారు. అసలు ఆంద్ర ప్రదేశ్ కి ప్రత్యెక హోదా మాట ఇచ్చిన కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కనీసం పన్నెత్తి ఒక్క మాట కూడా అడగకపోవడం పైన జగన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రత్యెక హోదా రానపుడు టీడీపీ ఎంపీలకు కేంద్రం లో మంత్రి పదవులు ఇందుకోసం ఉన్నాయి అని జగన్ నిలదీశారు. ప్రత్యెక హోదా అన్న పదం విభజన చట్టం లో చేర్చకముందే రాష్ట్రాన్ని రెండుగా విడగొట్టిన చంద్రబాబు ఇప్పుడు తెలంగాణా మీద ప్రేమ కార్చడం ఏంటి అన్ని ప్రస్త్నించారు ఆయన.ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసపుచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఖరిని ఎండగడుతూ గుంటూరు జిల్లా మంగళగిరి ‘వై’ జంక్షన్ సమీపంలో బుధవారం వైఎస్ జగన్ సమరదీక్ష చేపట్టారు.ఈ దీక్ష కి సర్వత్రా మంచి స్పందన లభిస్తోంది.