రెండిటికీ చంద్రబాబు అనర్హుడు

5 Jun 2015

టీడీపీ అధ్యక్ష పదవితో పాటు ఏపీ సీఎం పోస్టుకూ నారా చంద్రబాబునాయుడు రాజీనామా చేయాలని మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య డిమాండ్ చేశారు. ఓటుకు నోటు వ్యవహారంలో రేవంత్ రెడ్డి అరెస్ట్ కాగా, ఈ వ్యవహారంలో చంద్రబాబుకూ పాత్ర ఉందన్న ఆరోపణల నేపథ్యంలో సి.రామచంద్రయ్య కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడారు. ఈ కేసులో రేవంత్ పై మోపిన అభియోగాలు తేలిన తర్వాతే చంద్రబాబు తిరిగి పదవులు చేపట్టాలని రామచంద్రయ్య డిమాండ్ చేశారు.